Repair the Road చేయి చేయి కలిపారు.. రోడ్డుని సరిచేశారు..
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:08 AM
Joined Hands to Repair the Road గ్రామాల యువకులు సోమవారం చేయిచేయి కలిపారు. శ్రమదానంతో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు.
సీతంపేట రూరల్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామా లైన మొగదార-రుక్మిణిగూడ మట్టి రహదారిపై వేసిన సబ్ గ్రేడెడ్(జీఎస్‌బీ)మెటల్ ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకు పోయింది. దీంతో గుంతలు ఆ మార్గంలో ఏర్పడ్డాయి. ఆయా గ్రామస్థులు దిగువ ప్రాంతానికి వచ్చేందుకు ఇబ్బందులు పడు తున్నారు. దీంతో చేసేది లేక ఆయా గ్రామాల యువకులు సోమవారం చేయిచేయి కలిపారు. శ్రమదానంతో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వ ర్యంలో ఉపాధి నిధులు రూ.3.50కోట్లతో ఇటీవల ఆ రహదారి పనులు ఇటీవల చేపట్టారు. రహదారి పొడవునా మట్టిపనులు, అక్కడక్కడా కల్వర్ట్ నిర్మాణాలు పూర్తిచేశారు. దారిపొడవునా జీఎస్‌బీ మెటల్‌ను పరిచి సంబంధిత కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. దీనిపై సంబంధిత ఏఈ ఎన్.భాస్కరరావును వివరణ కోరగా వర్షం కారణంగా జీఎస్‌బీ కొట్టుకుపోవడం వాస్తవమేనని తెలిపారు. మరో వారం రోజుల్లో సీసీ రహదారి నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.
Updated Date - Jun 17 , 2025 | 12:08 AM