జీవో-3ను పునరుద్దరించాలి
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:24 AM
ప్రభుత్వం జీవో- 3ను పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు శతశాతం గిరిజనులకే కేటాయించాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.
కురుపాం,జూన్1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జీవో- 3ను పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు శతశాతం గిరిజనులకే కేటాయించాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. శనివారం సీతంపేటలో ప్రారంభమైన ఏజెన్సీ స్పెషల్ డీఎస్‌సీ సాధన జీపు జాతర ఆదివారం కురుపాం చేరుకుంది. ఈ సందర్భంగా కురుపాం రావాడ రోడ్డు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ మెగా డీఎస్‌సీ నుంచి ఏజెన్సీ టీచర్ల పోస్టులను మినహాయించి శతశాతం ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలన్నారు. మెగా డీఎస్‌సీలో ఏజెన్సీ ప్రాంతంలో సుమార్ 766 టీచర్ల పోస్టులు గిరిజనులకు దక్కవలసి ఉండగా కేవలం 42 మాత్రమే గిరిజనులకు రిజర్వేషన్ చూపిస్తున్నరని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మేగా డీఎస్‌సీ మినహాయించి, గిరిజనులకు స్పెషల్ డీఎస్‌సీ ద్వారా నోటిఫికేషన్ వేసి శతశాతం గిరిజనులకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయాలి
మక్కువ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):గిరిజన ప్రాంత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర కోరారు. మండలంలోని మార్కొండపుట్టి, వైఎస్‌వలసలో జీపుజాతా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్-3ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా నాయకులు ఎం.రామస్వామి, వ్యవసాయసంఘం జిల్లాకార్యదర్శి కొల్లి గంగునాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వై.నాయుడు, తాడంగి ప్రభాకర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 12:24 AM