ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చట్ట ప్రకారమే.. అనడం బాధాకరం

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:54 PM

జిందాల్‌ నిర్వాసితులకు అంతా చట్ట ప్రకారమే జరుగు తుందని అంతకు మించి ఇంకా ఏం చేయలేమని కలెక్టర్‌ పేర్కొనడం బాధాకరమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు.

శృంగవరపుకోట రూరల్‌ జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిందాల్‌ నిర్వాసితులకు అంతా చట్ట ప్రకారమే జరుగు తుందని అంతకు మించి ఇంకా ఏం చేయలేమని కలెక్టర్‌ పేర్కొనడం బాధాకరమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. శనివారం బొడ్డవర గ్రామంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. 2008లో కిల్తంపాలెం నవోదయ విద్యాల యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ మినిట్స్‌ ఒక్క సారి చదవాలని కోరారు. దాని ప్రకారమే వారికి న్యాయం చేయాలన్నారు. జిందాల్‌ నిర్వాసితుల పట్ల అటూ ప్రజాప్రతినిధులు, ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. జిందాల్‌ కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు నిర్వాసి తులతో ఒక్క సమావేశం నిర్వహిస్తే ఈ సమస్య చిటికె లో తేలిపోతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతుల పక్షాన నిలిచి వారికి ఎలా న్యాయం చేశారో జిందాల్‌ నిర్వాసితులకు అదే చేయాలని కోరుతు న్నామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేశ్‌ అపాయింట్‌మెంట్‌ కోరామని, అంగీకారం వచ్చిన వెంటనే వారిని కలిసి, సమస్య వివరిస్తామన్నారు. అంతా చట్టప్రకారం అంటున్న కలెక్టర్‌.. 18 ఏళ్ల కిందట జిందాల్‌ ఇచ్చిన పరిహారం రైతులు వెనక్కి ఇచ్చేస్తే వారి భూములు ఇప్పిస్తారా.. ఆయన కోరారు.

Updated Date - Jul 12 , 2025 | 11:54 PM