ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లేబర్‌ కోడ్లు ఆమోదించడం సరికాదు

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:22 AM

:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించడం సరికాదని సీఐటీయూ నాయ కులు పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం బొబ్బిలి కోరాడవీధి జంక్షన్‌లో సీఐ టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసనతెలిపారు.

బొబ్బిలిలో నిరసన తెలుపుతున్న కార్మికులు

బొబ్బిలి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించడం సరికాదని సీఐటీయూ నాయ కులు పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం బొబ్బిలి కోరాడవీధి జంక్షన్‌లో సీఐ టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసనతెలిపారు.ఈసందర్భంగా సీఐటీయూ నాయకుడు పి.శంకరరావు మాట్లాడుతూ కొత్త నిబంధనల ప్రకారం ఎని మిది నుంచి 12 గంటల పనివిధానానికి తెరలేపడం దుర్మార్గ చర్యఅని తెలిపారు. కార్మికుల రక్తమాంసాలను పీల్చి పిప్పిచేస్తున్న వర్గానికి ఇది మరింత ఊతమిస్తోందన్నారు. టెక్నాలజీ నెపంతో ఇప్పటికే మానవశ్రమను తగ్గిస్తున్నారని, దీనికి తోడుగా పనిగంటలను పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నిరుద్యోగాన్ని పెంచడానికి, కొనుగోలు శక్తి నశించడానికి ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు దోహదం చేస్తాయని తెలిపారు. లేబర్‌ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ సమ్మెలో యావత్‌ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో గౌరీశ్‌, రామారావు, యుగంధర్‌, వెంకటి పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:22 AM