కార్మిక హక్కులను హరించడం దుర్మార్గం
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:22 AM
కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించడం దుర్మార్గమని కార్మిక సంఘాల నాయకులు అన్నారు.
- జిల్లాలో వివిధ సంఘాల ర్యాలీ
విజయనగరం దాసన్నపేట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించడం దుర్మార్గమని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో కార్మిక సంఘాలు బుధవారం సార్వత్రిక సమ్మె చేపట్టాయి. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కోట జంక్షన్ నుంచి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి సంఘటిత కార్మిక వర్గం లేకుండా చూడాలని కేంద్రం చూస్తుందని అన్నారు. సీపీఎం, సీపీఐ, ఏఐటీయూుసీ, ఏఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగింది. నాయకులు రెడ్డి శంకరరావు, రెడ్డి నారాయణరావు, అప్పలరాజు రెడ్డి, ఏబీజీవీబీ ఉద్యోగులు, బుగత అశోక్, రంగరాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో సార్వత్రిక సమ్మె పాక్షికంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు యథావిధిగా పని చేశాయి.
Updated Date - Jul 10 , 2025 | 12:22 AM