ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

is it correct transfers బదిలీల్లో ప్రత్యే‘కథ’లు

ABN, Publish Date - Jun 06 , 2025 | 11:44 PM

is it correct transfers

ఎస్‌.కోట మండల వీఆర్‌ఓ బదిలీ జాబితాలో వరుస నెంబర్‌ 5లో సీహెచ్‌ కృష్ణ పేరు(జీవించి లేరు)

బదిలీల్లో ప్రత్యే‘కథ’లు

రెవెన్యూలో ఆత్మకు బదిలీ

ఎస్‌.కోట, నెల్లిమర్ల, రాజాం నియోజకవర్గాలపైనే ఎక్కువ దృష్టి

ముగ్గురు తహసీల్దార్‌లు, మరో ఇద్దరు ఉప తహసీల్దార్‌లను మన్యం జిల్లాకు కేటాయింపు

వర్గరాజకీయాలకు గురైన ఎస్‌.కోట నియోజకవర్గ అధికారులు

- శృంగవరపుకోట మండలం వేములాపల్లి గ్రామ రెవెన్యూ అధికారి సీహెచ్‌ కృష్ణ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 28న మృతి చెందారు. రెవెన్యూ శాఖ గురువారం జరిపిన బదిలీల్లో ఇతన్ని లక్కవరపుకోట మండలం కల్లేపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా నియమించింది.

- బదిలీల్లో 19 మంది తహసీల్దార్‌లకు స్థాన చలనం కల్పించారు. ఇందులో శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని ఎస్‌.కోటతో పాటు ఎల్‌.కోట, కొత్తవలస, జామి మండలాల తహసీల్దార్‌లను కదిపారు. ఒక్క వేపాడ మండల తహసీల్దార్‌పై మాత్రమే కరుణ చూపారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో నెల్లిమర్లతో పాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం తహసీల్దార్‌లను మార్చేశారు. రాజాం నియోజకవర్గంలో రాజాంతో పాటు వంగర, సంతకవిటి తహసీల్దార్‌లకు బదిలీ అయింది.

- 25 మంది ఉప తహసీల్దార్‌లను బదిలీ చేశారు. వీటిలోనూ ఈ నియోజకవర్గాలకు మినహాయింపు ఇవ్వలేదు. ఎస్‌.కోట నియోజకవర్గంలో ఎస్‌.కోట ఉప తహసీల్దార్‌, ఎన్నికల ఉప తహసీల్దార్‌, కొత్తవలస, వేపాడ ఉప తహసీల్దార్‌లు, ఎల్‌.కోట పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్‌లను మార్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం ఉప తహసీల్దార్‌లు, రాజాం నియోజకవర్గంలో సంతకవిటి ఉపతహసీల్దార్‌తో పాటు రీసర్వే ఉప తహసీల్దార్‌, రాజాం ఎన్నికల ఉప తహసీల్దార్‌, వంగర ఉప తహసీల్దార్‌లకు స్థాన చలనం కలిగింది.

శృంగవరపుకోట, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో అత్యధికంగా మూడు నియోజకవర్గాల పరిధిలోని మండల ముఖ్య రెవెన్యూ అధికారులకు బదిలీ అయింది. పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించిన ముగ్గురు తహసీల్దార్‌లలో ఇద్దరు శృంగవరపుకోట నియోజకవర్గపరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట తహసీల్దార్‌లు. ఇద్దరు ఉప తహసీల్దార్‌లలో ఎస్‌.కోట, వేపాడ మండలాలకు చెందిన వారే ఉన్నారు. కాగా జిల్లా రెవెన్యూ శాఖ నేతల మాటలను వినడంలోనే కాదు మృతి చెందిన అధికారులను గుర్తించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారం రోజుల కిందట మృతిచెందిన గ్రామ రెవెన్యూ అధికారిని బదిలీల్లో చూపించారు. గత ఏడాది బదిలీల్లో గజపతినగరం తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.అరుణకుమారిను శృంగవరపుకోట మండలంలో నియమించారు. ఈ మండలంలో ప్రధానంగా జిందాల్‌ భూములతో పాటు వైసీపీకు చెందిన ఓ ముఖ్యనేత బంధువుల లేఅవుట్‌ సమస్య ఉంది. ఓ ట్రస్టు నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు సమర్థ అధికారిగా పేరున్న ఈమెను ఇక్కడకు పంపించారు. అప్పట్లో వేరే మండలానికి బదిలీ చేయాలని ఈమె విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదు.

- ప్రస్తుత బదిలీల్లో ఎస్‌.కోట తహసీల్దార్‌గా వచ్చిన డి.శ్రీనివాసరావు అప్పట్లో ఈ మండలానికి రావాలని చేసిన ప్రయత్నాలకు అధికారులే అడ్డుకట్టవేశారు. మరో నాలుగైదు నెలల్లో పదోన్నతి పొందేందుకు సిద్ధంగా ఉన్న తహసీల్దార్‌ అరుణకుమారిని సాగనంపారు. అయితే గతంలో తాను కోరుకున్న మండలానికి పంపించడం ద్వారా ఈమెకు కొంత వెసులుబాటు కల్పించారు. ఇదే మండల ఉప తహసీల్దార్‌ భరత్‌కుమార్‌ను రెండు నెలల క్రితం జామి ఉప తహసీల్దార్‌గా పంపించారు. అక్కడ తహసీల్దార్‌తో సెలవు పెట్టించిన ఉన్నతాధికారులు ఇతనికి పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు పంపించేశారు.

- గత ఏడాది జరిగిన బదిలీల్లో లక్కవరపుకోట తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన డీఎంజీఎన్‌ ప్రసాదరావు, కొత్తవలస తహసీల్దార్‌ బి.నీలకంఠరావులను పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించడం స్థానికంగా చర్చకు దారితీసింది.

వర్గ రాజకీయాలే కారణమా?

వర్గ రాజకీయాలకు పేరు శృంగవరపుకోట. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధిపత్య పోరు ఉంటుంది. ప్రస్తుత అధికార పార్టీ నాయకుల్లోనూ ఇదే పరిస్థితి. ఎవరైనా ఒక అధికారి ఒక నాయుకుడికి అనుకూలంగా పని చేసినట్లు తెలిస్తే మరో నాయకుడు కన్నెర్రచేస్తారు. బదిలీల సమయంలో అధిపత్యం చూపిస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లోను ఇదే జరిగింది. ఓ నాయకుడు తన ఆధిపత్యాన్ని చూపించుకొనేందుకు ఈ నియోజకవర్గ మండలాల అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. తనకు, తన వర్గానికి అనుకూలంగా ఉండడం లేదన్న అనుమానం వున్న అధికారులందరినీ ఇక్కడి నుంచి పంపించేశారు. తనకు అనుకూలంగా పని చేస్తామని మాటచ్చిన అధికారులను నియమించకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులను కూడా వదల్లేదు. నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో ఓ రెవెన్యూ అధికారి బాగా పని చేస్తారని పేరుంది. గత ఏడాది బదిలీల్లో వేరే గ్రామానికి బదిలీ చేసుకొనేందకు ఆయన విన్నవించుకున్నారు. అయితే ఇతని పనితీరు తెలుసుకున్న అక్కడి తహసీల్దార్‌ బదిలీపై వెళ్లకుండా ఇక్కడే పని చేసేలా ఉంచేశారు. ఇప్పుడు ఓ గ్రామ స్థాయి నేత ఇతనిపై ఫిర్యాదు చేయడంతో దాదాపు 100 కిలోమీటర్లు దూరం ఉన్న గ్రామానికి విసిరేశారు. గత ఏడాది బదిలీని తహసీల్దార్‌ ఆపకుంటే దగ్గరలో ఉద్యోగం చేసుకొనేవాడనని ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు.

Updated Date - Jun 06 , 2025 | 11:44 PM