24 గంటలూ వైద్యం అందుతోందా?
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:05 AM
‘జిల్లాలో వైద్య ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. ఎక్కడా సీజనల్ వ్యాధులు, డయేరియా వంటి మాట వినిపించకూడదు. గుర్ల డయేరియా ఘటన దృష్ట్యా మరోసారి అటువంటి వాటికి అవకాశం ఇవ్వద్దు’’ సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగానికి చేసిన హెచ్చరికలు ఇవి. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపడడం లేదు. ఇప్పటికీ చాలా ఆస్పత్రులకు సాయంత్రం 5 గంటలు దాటితే తాళాలు పడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదు.
24 గంటలూ
వైద్యం అందుతోందా?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగుపడని సేవలు
పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండని వైద్యులు, సిబ్బంది
కుక్కకాటుకూ మందు ఇవ్వని వైనం
రాజాం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘‘జిల్లాలో వైద్య ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. ఎక్కడా సీజనల్ వ్యాధులు, డయేరియా వంటి మాట వినిపించకూడదు. గుర్ల డయేరియా ఘటన దృష్ట్యా మరోసారి అటువంటి వాటికి అవకాశం ఇవ్వద్దు’’ సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగానికి చేసిన హెచ్చరికలు ఇవి. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపడడం లేదు. ఇప్పటికీ చాలా ఆస్పత్రులకు సాయంత్రం 5 గంటలు దాటితే తాళాలు పడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 24 గంటలూ వైద్యసేవలందుతున్నాయి. 80 వరకూ పీహెచ్‌సీలు కొనసాగుతున్నాయి. ఇందులో 53 పీహెచ్‌సీల్లో 24 గంటల పాటు వైద్యసేవలు అందుబాటులో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు కానీ చాలావరకూ ఆస్పత్రులు 24 గంటలు కాదు కదా..12 గంటలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత ఆస్పత్రులకు తాళాలు పడుతున్నాయి. రేగిడి మండలం బూరాడ, వంగర మండల కేంద్రంలోని ఆసుపత్రితో పాటు రాజాం మండలం బొద్దాం పీహెచ్‌సీలకు అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారికి నిరాశే ఎదురవుతోంది. పాము, కుక్కకాటు, రోడ్డు ప్రమాద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులను పలకరించడానికి నైట్ వాచ్‌మెన్లు సైతం కనిపించడం లేదు. పీహెచ్‌సీల తీరుపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీలోని 30 పీహెచ్‌సీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మధ్యాహ్నానికి కొంతమంది వైద్యులు, సిబ్బంది ఇంటిముఖం పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా ఉండడం లేదు
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానికంగా నివాసముండాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతోంది కాని ఈ నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. ఎక్కువ మంది సుదూర ప్రాంతాల్లోని పట్టణాలు, మండల కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సబ్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు కనీస సమయపాలన పాటించడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి పీహెచ్‌లకు వెళ్లి అక్కడ నుంచి వ్యాధి నిరోదక టీకాలు, సామగ్రిని సబ్ సెంటర్లకు తీసుకెళ్లేటప్పటికి మధ్యాహ్నం 12 దాటుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఎక్కువ మంది డిప్యూటేషన్లపై గడుపుతున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో విధులు మార్పు చేసుకుంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉంటు న్నాయి. రోగులకు సేవలు అందకండా పోతున్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పీహెచ్‌సీలపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
వసతులు మెరుగుపరుస్తాం
పీహెచ్‌సీల్లో వసతులు మెరుగుపరుస్తున్నాం. 24 గంటలూ వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నాం. నిబంధనలు, సమయపాలన పాటించని వైద్య ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజలు వినియోగించుకోవాలి.
జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం
------------------
Updated Date - Apr 17 , 2025 | 12:05 AM