Irrigation issue will be discussed in Parliament సాగునీటి సమస్యను పార్లమెంటులో చర్చిస్తా
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:46 PM
Irrigation issue will be discussed in Parliament తన పార్లమెంటరీ నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక పంటలు పోతున్నాయని, ఈ సమస్యను ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఆదివారం ప్రత్యేకంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సాగునీటి సమస్య ఉందన్నారు.
సాగునీటి సమస్యను పార్లమెంటులో చర్చిస్తా
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
విజయనగరం, జూలై 20(ఆంధ్రజ్యోతి): తన పార్లమెంటరీ నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక పంటలు పోతున్నాయని, ఈ సమస్యను ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఆదివారం ప్రత్యేకంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సాగునీటి సమస్య ఉందన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో రహదారులు సరిగా లేవని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పర్యాటక రంగ అభివృద్ధిపై కూడా మాట్లాడతానన్నారు. తన నియోజకవర్గ పరిధిలో తీర ప్రాంతం అధికంగా ఉందని, దీనిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించి పార్లమెంటులో చర్చిస్తానన్నారు. ఈ ఏడాది కాలంలో ఇంతవరకూ నాలుగు పర్యాయాలు పార్లమెంటు సమావేశాలు జరిగాయని, ఇప్పటివరకు సభలో 89 ప్రశ్నలు వేశానని చెప్పారు. వివిధ సమస్యలపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నానన్నారు. ఈ విషయంలో తాను తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. విజయనగరం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నానన్నారు.
-----------
Updated Date - Jul 20 , 2025 | 11:46 PM