ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బొబ్బిలి ఐటీఐలో విచారణ

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:09 AM

స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటిఐ)లో గతంలో స్ర్టైవ్‌ పథకంలో మంజూరైన సుమారు రూ.90 లక్షల విలువైన పరికరాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరావు విచారణ చేపట్టారు.

పరికరాలను పరిశీలిస్తున్న దృశ్యం

అవకతవకలపై డీడీ ఆరా

బొబ్బిలి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటిఐ)లో గతంలో స్ర్టైవ్‌ పథకంలో మంజూరైన సుమారు రూ.90 లక్షల విలువైన పరికరాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరావు విచారణ చేపట్టారు. ఐటీఐలో ఆయన మంగళ, బుధవారాలలో విచారణ చేపట్టినప్పటికీ సమాచారాన్ని బ యటకు పొక్కనీయలేదు. విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకు న్నారు. వారిని కలుసుకునేందుకు ఆ యన ఇష్టప డలేదు. వివరాలు వెల్లడించడానికి, కనీ సం ఫొటో తీసుకునేందుకు కూడా సమ్మతించలేదు. బయటి నుంచే మీడియాను పంపించివేశారు. ఐటీఐలో వివిధ అంశాలలో అవకతవకలు జరిగినట్లు కొంతమంది విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారికన్నా ముందుగా శాఖాపరంగా డీడీ విచారణ చేపట్టినట్టు తెలిసిం ది. ఐటీఐలో పనిచేస్తున్న సిబ్బందిని ఒక్కొక్కరిని పిలిపించి... ఆయన విచారించినట్లు తెలిసింది. ఐటీఐలోని వివిధ విభా గాలను కూడా పరిశీలించినట్లు సమాచారం.

Updated Date - Apr 10 , 2025 | 12:09 AM