పరిశ్రమలు ఏర్పాటుచేయాలి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:55 PM
నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అను వైన వాతావరణం ఉండడంతో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఏర్పాటుచేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు.మంగళవారంకొంగవాని పాలెం సమీ పంలో ఇన్వెస్ట్‌ఇన్ నెల్లిమర్ల కార్యక్రమం నిర్వహించారు.
భోగాపురం,జూన్24(ఆంధ్రజ్యోతి):నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అను వైన వాతావరణం ఉండడంతో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఏర్పాటుచేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు.మంగళవారంకొంగవాని పాలెం సమీ పంలో ఇన్వెస్ట్‌ఇన్ నెల్లిమర్ల కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ ఇక్కడపరిశ్రమల స్థాపనకు ప్రభుత్వసహకారం ఉంటుందన్నారు. అడ్డం కులను అధిగమించి పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించ డానికి కృషి చేస్తామని తెలిపారు.ఎంఎస్‌ఎంఈ పార్క్ ప్లాట్ యజమానులతో మ్యాప్ ద్వారా చర్చించారు. కార్యకమ్రంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ప్లాట్స్ యజమానులు, మిరా కిల్ సాప్ట్‌వేర్ సిస్టిమ్ సీఈవో లోకం ప్రసాదు, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:55 PM