నేటి నుంచి నిరవధిక సమ్మె
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:43 PM
తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు మునిసిపల్ ఇంజి నీరింగ్ యూనియన్ నాయకులు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారంకోసం 46 రోజులుగా పోరాటం చేస్తున్న మునిసిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది శనివారం రాజాంలో వినూత్నంగా నిరసన తెలిపారు.
రాజాం రూరల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు మునిసిపల్ ఇంజి నీరింగ్ యూనియన్ నాయకులు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారంకోసం 46 రోజులుగా పోరాటం చేస్తున్న మునిసిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది శనివారం రాజాంలో వినూత్నంగా నిరసన తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మునిసిపల్ ఇంజి నీరింగ్ సిబ్బంది ఒంటికాలిపై నిలుచొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా యూని యన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప తమ సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించడంలేదని ఆరోపించారు.
Updated Date - Jun 21 , 2025 | 11:43 PM