Amaravati Women అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగవు
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:39 AM
Inappropriate Comments on Amaravati Women Are Unacceptable రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి మాజీ సీఎం జగన్, సాక్షి మీడియాపై ఫిర్యాదు చేశారు.
సాలూరు, జూన్8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి మాజీ సీఎం జగన్, సాక్షి మీడియాపై ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన వారి కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మీడియాలో ఆ విధంగా మాట్లాడడం క్షమించరాని నేరమని తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్లు వరలక్ష్మి, వైదేహి, రాజేశ్వరి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 12:39 AM