Mock Drill ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
ABN, Publish Date - May 14 , 2025 | 11:02 PM
Impressive Mock Drill అత్యవసర, విపత్తుల వేళ క్షణాల వ్యవధిలో ప్రజలను ఏవిధంగా కాపాడాలన్నది స్పష్టంగా తెలిపేలా బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ , పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా పాల్గొని మాక్‌డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
పార్వతీపురం టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి) : అత్యవసర, విపత్తుల వేళ క్షణాల వ్యవధిలో ప్రజలను ఏవిధంగా కాపాడాలన్నది స్పష్టంగా తెలిపేలా బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ , పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా పాల్గొని మాక్‌డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఎలా సేవలు అందిస్తారో తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం సైరన్ మోగితే .. ప్రజలు ఎలా అప్రమత్తం కావాలి. స్వీయ రక్షణ ఎలా పొందాలో వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలను తెలియజేశారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉపకలెక్టర్ ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు ఆసక్తిగా మాక్‌డ్రిల్‌ను తిలకించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తమవుతూ అన్నింటికీ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Updated Date - May 14 , 2025 | 11:02 PM