HR Policy హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:03 AM
Implement the HR Policy ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో పనిచేస్తున్న సిబ్బందికి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ఆ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురంలోని డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసన
పార్వతీపురం టౌన్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో పనిచేస్తున్న సిబ్బందికి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ఆ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురంలోని డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సత్యం, బి.రామునాయుడు మాట్లాడుతూ... ‘2019 నుంచి 2024 వరకు వేతన సవరణ జరిపి కొత్త జీతాలు నిర్ణయించాలి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే విధంగా డీఎల్‌ఏసీలో తీర్మానించాలి. 2019 తరువాత విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలి. రెగ్యులర్ సిబ్బందిని పీఏసీఎస్‌లో ఖాళీగా ఉన్న సీఈవో పోస్టులకు ఎంపిక చేయాలి. సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలి. డీసీసీబీ సీఈవో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం తక్షణమే డీఏ అమలు చేయాలి. జిల్లాలో పీఏసీఎస్ ఉద్యోగులకు అడ్వాన్సు రూపంలో జీతాలు చెల్లించడం చట్టవిరుద్ధం. అందుకే జీతాలు చెల్లించేందుకు పర్సన్ ఇన్‌చార్జులకు ఆదేశాలు జారీ చేయాలి.’ అని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా సహకార అధికారి పి. శ్రీరామ్మూర్తికి వినతిపత్రం అందించారు. సంఘ గౌరవాధ్యక్షుడు పి. కామేశ్వరరావు, కోశాధికారి ఏవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:03 AM