ఏ సమస్యకైనా తక్షణమే పరిష్కారం
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:13 AM
ఏ సమస్యకైనా తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. బుఽధవారం ముని సిపాలిటీలోని 11, 12వార్డుల్లో గుడ్‌మార్నింగ్ పార్వ తీపురం కార్యక్రమంలో భాగంగా పర్యటించి, సమ స్యలు తెలుసుకున్నారు.
పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఏ సమస్యకైనా తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. బుఽధవారం ముని సిపాలిటీలోని 11, 12వార్డుల్లో గుడ్‌మార్నింగ్ పార్వ తీపురం కార్యక్రమంలో భాగంగా పర్యటించి, సమ స్యలు తెలుసుకున్నారు. వార్డుల్లో పారిశుధ్య నిర్వ హణ, తాగునీటిసరఫరాపై పలువురు ఫిర్యాదు చే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునిసి పాలిటీని స్వచ్ఛ సుందర పార్వతీపురంగా తీర్చి దిద్ద డమే లక్ష్యమన్నారు.
కులగణన తర్వాతే రిజర్వేషన్ ప్రక్రియ జరగాలి
రాష్ట్రంలో ఎస్సీల కులగణన తర్వాతే రిజర్వేషన్ ప్రక్రియ జరగాలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా రెల్లి, వాటి ఉపకులాల సేవా సంఘం కన్వీనర్ జి.డేనియల్ కోరారు. స్థానిక ఇందిరాకాలనీకూడలిలో ఎమ్మెల్యే విజయచంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు.
పదోన్నతులు కల్పించాలి
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని జిల్లా వెలేర్ అసిస్టెంట్స్ సంఘం అధ్యక్షురాలు సిరిపురపు పద్మ, సెక్రటరీ కె.విద్యా సాగర్ కోరారు. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు వినతిపత్రాన్ని ఉద్యోగులు అందజేశారు.
Updated Date - Apr 24 , 2025 | 12:13 AM