Turns Lush Green! శివారుకు అందితే సస్యశ్యామలమే!
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:20 PM
If It Reaches the Outskirts, It Turns Lush Green! మక్కువ మండలం శంబరలో ఉన్న వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్) నుంచి ఖరీఫ్‌కు సాగునీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బొబ్బిలి, మక్కువ, సీతానగరం మండలాల పరిధిలో ఆయకట్టు సంఘాలతో సమావేశం నిర్వహించారు.
ఆగస్టు మొదటి వారంలో నీటి విడుదలకు సన్నాహాలు
త్వరతిగతిన కాలువ పనులు
రైతుల్లో సందేహాలు
చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించాలని విన్నపం
మక్కువ రూరల్, జూలై 12(ఆంధ్రజ్యోతి) : మక్కువ మండలం శంబరలో ఉన్న వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్) నుంచి ఖరీఫ్‌కు సాగునీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బొబ్బిలి, మక్కువ, సీతానగరం మండలాల పరిధిలో ఆయకట్టు సంఘాలతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, కాలువల స్థితిగతులు, సాగునీరు సరపరాలో ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మూడు మండలాల్లో మొత్తంగా 24,700 ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరీఫ్ రైతులకు ఎటువంటి కలగకుండా శివారు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
శివారుకు అందట్లే..
ప్రాజెక్టు సామర్థ్యం 161 మీటర్లు కాగా ప్రస్తుతం 160.2 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. కుడి ప్రధాన కాలువ ద్వారా సుమారు 16వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 8వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. అయితే ఆయకట్టు శివారు భూములకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. వీఆర్‌ఎస్‌లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నందున సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
చురుగ్గా పూడికతీత పనులు
వీఆర్‌ఎస్ ప్రాజెక్టు ప్రధాన కాలువల్లో పూడికతీత పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మక్కువ మండలంలో ఆరు పనులకు రూ.26లక్షలు మంజూరు కాగా.. త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జైకా నిధులతో కుడి కాలువలో 4 కిలోమీటర్లు, ఎడమ ప్రధాన కాలువలో 2కిలోమీటర్ల పరిధిలో లైనింగ్ పనులు పూర్తి చేశారు. బొబ్బిలి మండలంలో 12పనులు చేపడుతున్నారు. రూ.55 లక్షలతో వివిద బ్రాంచి ఉపకాలువల్లో 15 పనులు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారంలో సాగునీటిని విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు ఈఈ ప్రదీప్ తెలిపారు. అన్ని కాలువల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నామన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 11:20 PM