హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలి
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:54 PM
హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, ఏపీసీఓఎస్‌ను రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని, పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరారు.
బొబ్బిలి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, ఏపీసీఓఎస్‌ను రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని, పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరారు.బుధవారం బొబ్బిలి మునిసిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరిగ్ కార్మికుల ధర్నా మూడోరోజు కొనసాగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి సరఫరా, వీధిదీపాల కార్మికుల కనీస వేతనం టెక్నికల్‌కు రూ.29,200, నాన్ టెక్నికల్‌కు రూ.24,600చొప్పున చెల్లించాలని, 15 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వారిని రెగ్యు లర్ చేయాలని, విధినిర్వహణలో చనిపోయినవారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషి యోతో పాటుకుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, సీనియారిటీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. పదవీవిరమణ తరువాత గ్రాట్యూటీ, రూ. 10 వేలు పెన్షన్ చెల్లించాలని, 69 రోజులు సెలవు ప్రకటించాలని డిమాండ్‌చేశారు.
Updated Date - Jun 25 , 2025 | 11:54 PM