ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Housing Targets నెలాఖరుకు గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తికావాలి

ABN, Publish Date - May 09 , 2025 | 11:33 PM

Housing Targets Must Be Completed by Month-End గృహ నిర్మాణ లక్ష్యాలు ఈ నెలాఖరుకు పూర్తికావాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. వివిధ శాఖల పనుల ప్రగతిపై చర్చించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ శోభిక

పార్వతీపురం ఆంధ్రజ్యోతి, మే9 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ లక్ష్యాలు ఈ నెలాఖరుకు పూర్తికావాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. వివిధ శాఖల పనుల ప్రగతిపై చర్చించారు. జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అదనపు ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో పనులు జరపడం లేదని తెలిపారు. అటువంటి వాటివారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంకా 3,098 జన్‌మన్‌ గృహ నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 11,450 పంట గుంతలు లక్ష్యంగా నిర్దేశించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే 9,087 మంజూరు చేయగా 2,900 పూర్తయ్యాయన్నారు. ప్రతి మండలంలో కనీసం ఐదు చెరువులను అమృత్‌ సరోవర్‌ కింద గుర్తించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:33 PM