ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Housing Construction గృహ నిర్మాణాలు మరింత వేగవంతం

ABN, Publish Date - Mar 18 , 2025 | 11:53 PM

Housing Construction Speeds Up జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు, జిల్లా ప్రత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు, జిల్లా ప్రత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర- 2047 విజన్‌లో భాగంగా 2029 నాటికి అందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దీనిలో భాగంగానే పీఎంఏవై 1.0లో మంజూరైన ఇళ్ల నిర్మాణాల పూర్తికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఆర్థికసాయం అందించాలని సంకల్పించిందని వెల్లడించారు. వివిధ దశల్లో ఉన్న 10,717 గృహ నిర్మాణాలను పూర్తి చేసు కునేందుకు ఇదొక చక్కని అవకాశమని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Mar 18 , 2025 | 11:53 PM