ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీలు రాయడానికి సిబ్బంది నియామకం

ABN, Publish Date - May 20 , 2025 | 12:06 AM

ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరాక్ష రాస్యుల అర్జీలను రాయ డంలో సహకరించడానికి కలెక్టరేట్‌ నుంచి ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేస్తు న్నట్లు కలెక్టరు అంబేడ్కర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 154 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టరు అంబేడ్కర్‌, ఇన్‌చార్జీ డీఆర్వో మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీలు స్వీకరించారు.

విజయనగరం కలెక్టరేట్‌, మే 19 (ఆంధ్రజ్యోతి) : ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరాక్ష రాస్యుల అర్జీలను రాయ డంలో సహకరించడానికి కలెక్టరేట్‌ నుంచి ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేస్తు న్నట్లు కలెక్టరు అంబేడ్కర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 154 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టరు అంబేడ్కర్‌, ఇన్‌చార్జీ డీఆర్వో మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీలు స్వీకరించారు. వినతుల్లో 116 రెవెన్యూకు సందిం చినవి కావడం విశేషం. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ నిరక్ష్యరాసులైన వారు తమ అర్జీరాయడానికి దళారులను ఆశ్రయిస్తున్నారని, దీంతో వారు అర్జీదా రులను మభ్య పెట్టి వారి నుంచి డబ్బులు తీసుకుని ప్రతి సోమవారం కలెక్టరేట్‌ చుట్టు తిరిగేలా చేస్తున్నారని చెప్పారు. మండల, డివిజన్‌ స్థాయిలో పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రానికి రావాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ జిల్లా అధికారులు రావాలని ఆదేశించారు. సెలవుల కోసం సెల్‌ పోన్‌లో మెసెజ్‌ పెట్టేవారికి షోకాజ్‌ నోటీసులు ఇస్తామని తెలిపారు.

ఆధార్‌,రేషన్‌ కార్డు మంజూరు చేయాలి

కిడ్నీసమస్యలతో బాధపడుతుండడంతో డయాలసిస్‌ కోసం డాక్టర్లు రేషన్‌, ఆధార్‌ కార్డులు అడుగుతుండడంతో వాటిని మంజూరు చేసి ఆదుకోవాలని కలె క్టరు అంబేడ్కర్‌ను గరివిడి గ్రామానికి చెందిన బలివాడ వెంకట సత్య సాయి మదుకుమార్‌ గ్రీవెన్స్‌లో కోరారు. ఈ మేరకు స్పందించిన కలెక్టరు వెంటనే డీఎస్‌వో మదుసూదనరావు, సచివాలయం కోఆర్డినేటర్‌ను పిలిచి వారితో మాట్లాడి వెంటనే రెండు కార్డులు మంజూరుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విజయనగరంలోని ఆనంద నగర్‌ చెందిన శ్రీనిధిఐశ్వర్య పింఛన్‌కు మంజూరుచేయాలని తండ్రి బహ్మజీ పీజీఆర్‌ఎస్‌లో వినతి అందజేశారు. సదరం ధ్రువ పత్రం కూడా ఉందని వెంటనే పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు.

డిసెంబరులో గానుగ ప్రారంభం

జిల్లాలోని సంకలి చెక్కర కర్మాగారాన్ని మూసివేసే ప్రసక్తే లేదని కలెక్టరు అం బేడ్కర్‌ చెప్పారు. సంకిలిలోని ఫ్యాక్టరీ చెక్కర కర్మాగారం మనుగుడు తదితర అం శాలపై క్యాంపుకార్యాలయంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ చెక్కర కర్మాగారంలో డిసెంబరులో చెరకు గానుగ ప్రారంభమై మార్చివరకూ జరుగుతుందని చెప్పారు. ప్రసుత్తం చెరుకు సాగు ప్రకారం 2 లక్షలు నుంచి 2.5 లక్షలు టన్నుల వరకూ క్రసింగ్‌ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది సీజన్‌కు కనీసం 5 లక్షలు టన్నుల చెరుకు పండించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కాగా జూన్‌ 21న యోగాడే కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టరు ఆదేశించారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న అంబేడ్కర్‌ : కలెక్టరేట్‌ 2

Updated Date - May 20 , 2025 | 12:06 AM