ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Earth... ఆయన భూమిలో ఉందని..

ABN, Publish Date - Apr 07 , 2025 | 11:25 PM

He is on Earth... కొమరాడ మండలం డంగభద్ర నుంచి తమ్మన్నదొరవలస గ్రామాల మధ్యలో ఉన్న బీటీ రహదారిని ఓ వ్యక్తి అడ్డంగా తవ్వేశాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డంగభద్ర - బీటీ రహదారిని తవ్వేసిన దృశ్యం

గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు

కొమరాడ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం డంగభద్ర నుంచి తమ్మన్నదొరవలస గ్రామాల మధ్యలో ఉన్న బీటీ రహదారిని ఓ వ్యక్తి అడ్డంగా తవ్వేశాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 1.80 కోట్లతో పార్వతీపురం ఐటీడీఏ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఆ రహదారిని నిర్మించారు. అయితే తన జిరాయితీ భూమిలో రోడ్డు వేశారంటూ ఓ వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. రహదారిని అడ్డంగా తవ్వేశాడు. దీంతో పలు గ్రామాల రాకపోలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కొమరాడ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా తన జిరాయితీ భూమిలో రహదారి నిర్మించడం ఏమిటని తవ్విన వ్యక్తి ప్రశ్నించాడు. తహసీల్దార్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:25 PM