ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

He achieved what he wanted.. అనుకున్నది సాధించాడు..

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:57 PM

He achieved what he wanted.. అనుకున్నది సాధించాడా యువకుడు.. గ్రామీణ వాతావరణంలో పుట్టి.. పెరిగి.. విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. సివిల్స్‌ లక్ష్యంగా ప్రాథమిక స్థాయి నుంచి అడుగులు వేయడం ప్రారంభించాడు. బీటెక్‌ పూర్తయ్యాక వచ్చిన కొన్ని ఉద్యోగాలను వదులుకుని, మనసుకు నచ్చిన ఉద్యోగాలు చేస్తూ తన లక్ష్యం అయిన సివిల్స్‌ కోసం అహర్నిశలూ శ్రమించాడు. ఎట్టకేలకు మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 830వ ర్యాంకు సాధించాడు. అతనే రాజాంలోని ఈశ్వరనారాయణ కాలనీకి చెందిన వావిలపల్లి భార్గవ.

వావిలపల్లి భార్గవ

అనుకున్నది సాధించాడు..

రాజాం యువకుడికి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 830వ ర్యాంకు

ప్రస్తుతం సేల్స్‌ట్యాక్స్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): అనుకున్నది సాధించాడా యువకుడు.. గ్రామీణ వాతావరణంలో పుట్టి.. పెరిగి.. విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. సివిల్స్‌ లక్ష్యంగా ప్రాథమిక స్థాయి నుంచి అడుగులు వేయడం ప్రారంభించాడు. బీటెక్‌ పూర్తయ్యాక వచ్చిన కొన్ని ఉద్యోగాలను వదులుకుని, మనసుకు నచ్చిన ఉద్యోగాలు చేస్తూ తన లక్ష్యం అయిన సివిల్స్‌ కోసం అహర్నిశలూ శ్రమించాడు. ఎట్టకేలకు మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 830వ ర్యాంకు సాధించాడు. అతనే రాజాంలోని ఈశ్వరనారాయణ కాలనీకి చెందిన వావిలపల్లి భార్గవ. ప్రస్తుతం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్‌లో వాణిజ్య పన్నులశాఖ (స్టేట్‌ ట్యాక్స్‌)లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి వావిలపల్లి విష్ణు శ్రీకాకుళం జిల్లా పాలఖండ్యాం పాఽఠశాలలో హెచ్‌ఎంగా ఉన్నారు. తల్లి ఈశ్వరమ్మ గృహిణి. సోదరి తులసి బ్యాంకు ఉద్యోగి.

విద్యాభ్యాసం సాగిందిలా..

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని సాఽరధి గ్రామానికి చెందిన భార్గవ ఒకటి నుంచి పదోతరగతి వరకూ రాజాంలోని శారదా కాన్వెంట్‌లో చదువుకున్నారు. రాజాంలోని వేదగాయత్రి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, రాజాంలోని జిఎమ్మార్‌ ఐటిలో బీటెక్‌ (ఈఈఈ) పూర్తి చేశారు. ప్రాథమిక స్థాయి నుంచి సివిల్స్‌ లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదువుతున్న భార్గవ 2016లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముసునూరు బ్రాంచిలో (నూజువీడు సమీపం) అసోసియేట్‌గా రెండున్నరేళ్లు పనిచేశారు. 2018లో గ్రూప్‌ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 2022లో గ్రూప్‌ 1లో విజయం సాధించి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్‌లో వాణిజ్యపన్నుల శాఖ (స్టేట్‌ ట్యాక్స్‌) అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం భార్గవ అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.

వచ్చిన ఉద్యోగాలు వదులుకుని..

సివిల్స్‌ టార్గెట్‌ పెట్టుకున్న భార్గవ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా, డీఆర్‌డీవోలో స్టోర్‌ కీపర్‌గా, శ్రీకాకుళం జిల్లా కోర్టులో సైతం ఉద్యోగాలు సాధించారు. అయితే వాటిని కాదనుకుని సివిల్స్‌ లక్ష్యంగా అడుగులు వేస్తూ నాలుగో ప్రయత్నంలో 2024లో సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో విజయం సాధించారు. ఈనెల 22న విడుదలైన ఫైనల్‌ ఫలితాలలో జాతీయస్థాయిలో భార్గవ 830 ర్యాంకు సాధించారు.

మరోసారి భార్గవ్‌కు ఉత్తమ ర్యాంకు

ఈసారి 455

గంట్యాడ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పెదవేమలి గ్రామానికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్‌కు మరోసారి సివిల్స్‌లో 455 ర్యాంకు వచ్చింది. ఈయనకు గత ఏడాది 590వ ర్యాంకు రావడంతో ఐపీఎస్‌ ఖరారైంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీసు కళాశాలలో శిక్షణ తీసుకుంటున్నారు. ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో ఈసారి కూడా సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాశారు. తాజాగా మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 455వ ర్యాంకు వచ్చింది.

Updated Date - Apr 22 , 2025 | 11:57 PM