ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Grand Festivity ‘మహా’ సందడి

ABN, Publish Date - May 28 , 2025 | 11:43 PM

Grand Festivity టీడీపీ మహానాడు కార్యక్రమం రెండోరోజు బుధవారం అట్టహాసంగా జరిగింది. కడప వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లోజిల్లా నేతలు సందడి చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు.

మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న మంత్రులు లోకేశ్‌, సంధ్యారాణి తదితరులు

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం/సాలూరు రూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ మహానాడు కార్యక్రమం రెండోరోజు బుధవారం అట్టహాసంగా జరిగింది. కడప వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లోజిల్లా నేతలు సందడి చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌, ఇతర ముఖ్యనేతల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీభంజ్‌దేవ్‌, కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌చంద్రదేవ్‌, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, నాలుగు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:04 PM