ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు అండగా ప్రభుత్వం

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:29 AM

ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

చెక్కులు అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి
  • మంత్రి సంధ్యారాణి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర

  • సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సాలూరు/ మెంటాడ, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరులోని తన స్వగృహంలో ఆమె సుమారు రూ.3లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సాలూరులోని ప్రతిపాటి రాజారావుకు రూ.45,751, మెంటాడ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన గుళ్లిపల్లి రియానీ శ్రీనిధికి రూ.లక్షా 85వేల 701, పిట్టాడ గ్రామానికి చెందిన ఎర్ర మురళీకృష్ణకు రూ.85వేల చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఎస్‌ చైర్మన్‌ ముఖీ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, గూడెపు యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: కూటమి ప్రభుత్వం పేద లకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచం ద్ర అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:29 AM