ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి కోసం వెళ్లి.. ప్రాణాలు విడిచి

ABN, Publish Date - Apr 06 , 2025 | 12:49 AM

మండలంలోని సిరిపురంలో కర్రలకు తొక్కలు తీసే మిషన్‌లో పడి ఓ మహిళ శనివారం దుర్మరణం చెందింది.

జ్యోతి (ఫైౖల్‌)

గంట్యాడ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిరిపురంలో కర్రలకు తొక్కలు తీసే మిషన్‌లో పడి ఓ మహిళ శనివారం దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళితే.. సిరిపురంలో వివిధ కర్రలకు తొక్కే మిషన్ల వద్ద లక్కిడాంకు చెందిన అసకపల్లి జ్యోతి (30) పనిచేస్తోంది. రోజు మాదిరిగానే శనివారం పనికి వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం పనిచేసేందుకు సిద్ధమైంది. టాక్ట్రరుకు అనుకుని ఉన్న మిషన్‌ వద్దకు వెళ్లింది. మిషన్‌ స్పీడుగా తిరుగుతుండటంతో ఆమె చీర ప్రమాదవశాత్తు మిషన్‌లోకి వెళ్లి పోయింది. ఆ తర్వాత ఆమె జుట్టును కూడా మిషన్‌ లాగేసింది. దాంతో ఆమె జుట్టు ఊడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ అక్కడకు వచ్చి పరిస్థితిని పరిశీలిం చారు. మృతురాలి భర్త పరదేశినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలికి భర్త పరదేశినాయుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రశాంతి ఐదో తరగతి, చిన్న కుమార్తె ఒకటో తరగతి చదువుతోంది. జ్యోతి మృతితో లక్కిడాంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - Apr 06 , 2025 | 12:49 AM