ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవం.. దేవర ఉత్సవం

ABN, Publish Date - May 13 , 2025 | 12:24 AM

Glory.. Devara Utsavam భక్తుల జైజై నామస్మరణలు.. మేళతాళాలు.. వేద మంత్రోచ్ఛారణలు.. తప్పెటగుళ్లు, కోలాటాలు.. శక్తివేషాల సందడి నడుమ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరులతల్లి పైడిమాంబ దేవర ఉత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది.

అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ప్రధాన అర్చకుడు, భక్తులు

వైభవం.. దేవర ఉత్సవం

దారి పొడవునా భక్తుల జేజేలు

నేడు పైడిమాంబకు ప్రత్యేక పూజలు

విజయనగరం రూరల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): భక్తుల జైజై నామస్మరణలు.. మేళతాళాలు.. వేద మంత్రోచ్ఛారణలు.. తప్పెటగుళ్లు, కోలాటాలు.. శక్తివేషాల సందడి నడుమ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరులతల్లి పైడిమాంబ దేవర ఉత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. నిర్దేశించిన ముహూర్తం ప్రకారం రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడి నుంచి అమ్మవారి ఊరేగింపు మొదలైంది. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల ప్రాంతంలో హుకుంపేటలోని పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసానికి చేరుకుంది. అక్కడ పైడిమాంబ ఘాటాలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం పూజారి వెంకటరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులతో హుకుంపేట నుంచి రాత్రి 9 గంటలకు కీలకమైన దేవర ఉత్సవం ఆరంభమైంది. ఈ ఊరేగింపు పుచ్చలవీధి, ఉల్లివీధి, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా చదురుగుడికి చేరుకుంది. అక్కడి నుంచి కోట వద్దకు వెళ్లాక పూజలు నిర్వహించారు. దారిపొడవునా భక్తులు దేవర ఉత్సవానికి స్వాగతం పలకడమే కాకుండా జై జై పైడిమాంబ అంటూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఆలయ ఈవో ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ ఏడు కొండలు పాల్గొన్నారు. దేవర ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి కూడా పైడిమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు వనంగుడి వద్ద పైడిమాంబకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని, పైడిమాంబను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పుష్పాభిషేకం చేశారు.

నేడు పైడిమాంబకు ప్రత్యేక పూజలు

దేవర ఉత్సవంలో భాగంగా చదురుగుడికి చేరుకున్న పైడిమాంబకు ఆలయ అర్చకులు, సిబ్బంది మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. చదురుగుడిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇప్పటికే ఆలయం రంగు, రంగుల విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా కన్పిస్తోంది.

Updated Date - May 13 , 2025 | 12:24 AM