ఆక్రమణదారులకు నోటీసులివ్వండి: జేసీ
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:56 PM
కొత్తవలసలో ప్రభుత్వభూముల ఆక్రమణదారులకు నోటీసులివ్వాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో విజయనగరంలోని కలెక్టరేట్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
కొత్తవలస, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కొత్తవలసలో ప్రభుత్వభూముల ఆక్రమణదారులకు నోటీసులివ్వాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో విజయనగరంలోని కలెక్టరేట్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కొత్తవలసలోని కొత్తవలస -విజయనగరంలో రోడ్డులో గల సర్వేనెంబర్ 141, 142ల్లో గల ప్రభుత్వ, వాగు భూములు పరిశీలించారు. ఈ భూములకు సంబంధించి రెవెన్యూశాఖఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో జేసీ పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ నీలకంఠరావునుభూములు గురించి అడిగి తెలుసుకున్నారు. తొలుత కంటకాపల్లి గ్రామ రెవెన్యూకు సంబంధించిన భూములను పరిశీలించారు.
Updated Date - Apr 25 , 2025 | 11:56 PM