ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

R. Narayana Murthy: కళాకారులకు నిలయం గరివిడి

ABN, Publish Date - May 09 , 2025 | 11:41 PM

R. Narayana Murthy: గరివిడి అంటే కళాకారులకు నిలయమని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు.

మాట్లాడుతున్న ఆర్‌.నారాయణమూర్తి

- సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి

- ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

గరివిడి, మే 9 (ఆంధ్రజ్యోతి): గరివిడి అంటే కళాకారులకు నిలయమని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. గరివిడి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గరివిడిలాంటి మారుమూల ప్రాంతంలో ఫేకర్‌ యజమాని ఆర్‌.దుర్గాప్రసాద్‌ షరాబ్‌ పూర్వం నాటకాలు, క్రీడా పోటీలకు ఎంతో ప్రోత్సహించేవారని గుర్తుచేశారు. గరివిడికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గరివిడి కల్చరల్‌ అసోషియేషన్‌ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం కొన్ని సినిమా పాటలను పాడి చిందులు వేసి సభికులను ఆనందింపజేశారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఫేకర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు ఎం.జగన్నాథరాజు, ఉప సర్పంచ్‌ భమ్మిడి కార్తీక్‌, జడ్పీటీసీ వాకాడ శ్రీను, నాటక పోటీల గౌరవ అధ్యక్షుడు వాకాడ గోపీ, కార్యదర్శి కంబాల శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:41 PM