Arrested Immediately గంజాయి నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలి
ABN, Publish Date - May 28 , 2025 | 11:32 PM
Ganja Accused Must Be Arrested Immediately గంజాయి కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్ పరిధిలోనిఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం టౌన్/బెలగాం, మే 28 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్ పరిధిలోనిఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గంజాయి రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి.గంజాయి రవాణా చేసే వారిని అరెస్టు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాలి. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ ఇవ్వాలి. ఆ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. గంజాయిని వినియోగిస్తున్న వారిని గుర్తించికౌన్సిలింగ్ ఇవ్వాలి. దాని వల్ల కలిగే అనర్థాలపైవిస్తృత ప్రచారం చేయాలి. జిల్లాలో మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా గంజాయి సాగు, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలి.’ అని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డీఎస్పీరాంబాబు, డీసీఆర్బీ సీఐ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:05 PM