ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Galivaana గాలీవాన బీభత్సం

ABN, Publish Date - Apr 18 , 2025 | 11:47 PM

Galivaana Havoc సాలూరు, పాచిపెంట మండలాల్లో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ వేడిమి అధికంగా ఉండగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో కూలిన చెట్టు

పిడుగుపాటుకు ఆవు మృతి

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సాలూరు, పాచిపెంట మండలాల్లో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ వేడిమి అధికంగా ఉండగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సాలూరు మండలం మామిడిపల్లిలో దండిగాం వైపు వెళ్లే మార్గంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దండిగాం,శంబర మార్గాల వైపు వాహన రాకపోకలు స్తంభించాయి. ఇందులో తోణాం వచ్చే 108 వాహనం సైతం చిక్కుకోవడంతో గర్భిణీ తిప్పలు పడింది. అంటివలస జంక్షన్‌, గంగన్నదొరవలస వద్ద చెట్లు నేలకూలాయి. పలు చోట్ల అరటి చెట్లు సైతం నేలవాలాయి. స్థానికులు సహాయక కార్యక్రమాలు చేపట్టి రాకపోకలకు వీలు కల్పించారు. పాచిపెంట మండలం కూనంబందవలస, గడివలస మార్గంలోనూ చెట్లు పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. గడివలసలో పెళ్లి ఊరేగింపు వారు ఇబ్బందులు పడ్డారు. సకాలంలో స్థానికులు స్పందించి చెట్లు తొలగించారు. ఇదిలా ఉండగా మామిడిపల్లి గ్రామ శివారులో ఉన్న పొలంలో పిడుగు పడడంతో అక్కడే ఉన్న ఆవు మృతి చెందింది. గాలీవాన వల్ల జరిగిన నష్ట వివరాలను సాలూరు తహసీల్దార్‌ ఎన్వీ రమణ ఆరా తీశారు. సాలూరు పట్టణంలోనూ తేలిక పాటి వర్షం కురిసింది. అయితే వాతావరణం చల్లబడడంతో మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం చెందారు.

Updated Date - Apr 18 , 2025 | 11:47 PM