గ్రామాల అభివృద్ధికి నిధులు
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:26 AM
గ్రామాల అభివృద్ధికి కేంద్రం పలు పథకాలకు అవసరమైన నిధులు కేటాయిస్తోందని కేంద్ర బృందం డైరెక్టర్ తరుణ్ దోలియా తెలిపారు.
గరుగుబిల్లి,జూన్ 5(ఆంధ్రజ్యో తి): గ్రామాల అభివృద్ధికి కేంద్రం పలు పథకాలకు అవసరమైన నిధులు కేటాయిస్తోందని కేంద్ర బృందం డైరెక్టర్ తరుణ్ దోలియా తెలిపారు. గురువారం చినగుడబ పంచాయతీలోని గదబవలసలో జలజీవన్‌మిషన్‌కు చెందిన తాగు నీటి పథకాల పనితీరును కేంద్ర బృందం డైరెక్టర్ తరుణ్ దోలియా, వాటర్ కమిషన్ డైరెక్టర్ నిఖిల్ జెప్, శాస్త్రవేత్త డి.అనంతరావులు పథకంలో ఏర్పాటు చేసిన కుళాయి లను పరిశీలించారు. ఈసందర్భంగా దోలియా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఏ మేరకు పథకాలు అమలు చేస్తున్నారన్న దానిపై పరిశీలిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు శుద్ధ జలాలను అందించేందుకు జలజీవన్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గ్రామంలో ఏర్పాటు చేసిన కుళాయిలను పరిశీలించి గ్రామ స్థుల నుంచి సమాచారాన్ని సేకరించారు. కార్య క్రమంలొ ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకర్, డీఈఈ నాగేశ్వర రావు, ఎంపీడీవో జి.పైడితల్లి, ఈవోపీఆర్‌డీ ఎల్.గోపాలరావు, సర్పంచ్ ఎం.దుర్గాప్రసాద్, జేఈ గౌరీశంకర రావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:26 AM