TDP Door-to-Door నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:52 PM
From Today, TDP Door-to-Door రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుంచి ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. కూటమి శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రి, నేతలు బుధవారం నుంచి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు.
నెలరోజుల పాటు నిర్వహణ
ప్రజల్లోకి మంత్రి, ఎమ్మెల్యేలు, కూటమి శ్రేణులు
సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం
వైసీపీ చెప్పే అబద్ధాలను తిప్పికొట్టనున్న నేతలు
పార్వతీపురం, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుంచి ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. కూటమి శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రి, నేతలు బుధవారం నుంచి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. నెల రోజుల పాటు ప్రజా క్షేత్రంలోనే ఉండనున్నారు. కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులంతా ప్రతి ఇంటి తలుపునూ తట్టనున్నారు. ఏడాదిలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. భవిష్యత్‌లో చేయబోయే కార్యక్రమాలను తెలియజేయనున్నారు. వైసీపీ చెప్పే అబద్ధాలను తిప్పికొట్టనున్నారు. కాగా నేడు సాలూరు నియోజకవర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురంలో బోనెల విజయచంద్ర, పాలకొండలో నిమ్మక జయకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి గామంలోనూ పండుగలా ‘సుపరిపాలనకు తొలి అడుగు’ నిర్వహించేందుకు కూటమి శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. పింఛన్ల మొత్తం పెంపు, అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, ఉచిత ఇసుక, సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం, డీఎస్సీ, రేషన్ షాపులు పునఃప్రారంభం, రహదారులు, గోశాలల నిర్మాణం, కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను వివరించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను కూడా ప్రజలకు చెప్పనున్నారు.
Updated Date - Jul 01 , 2025 | 11:52 PM