Thotapalli to Santoshapuram తోటపల్లి నుంచి సంతోషపురం
ABN, Publish Date - May 03 , 2025 | 11:07 PM
From Thotapalli to Santoshapuram గరుగుబిల్లి మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా సుంకిలో సంచరించిన ఏనుగులు శుక్రవారం తోటపల్లి పంప్‌హౌస్ ప్రాంతానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో పంటలు, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా శనివారం ఏనుగులు తోటపల్లి నుంచి సంతోషపురానికి చేరుకున్నాయి.
గరుగుబిల్లి, మే 3(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా సుంకిలో సంచరించిన ఏనుగులు శుక్రవారం తోటపల్లి పంప్‌హౌస్ ప్రాంతానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో పంటలు, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా శనివారం ఏనుగులు తోటపల్లి నుంచి సంతోషపురానికి చేరుకున్నాయి. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులు భయాందోళన చెందు తున్నారు. అరటి, పామాయిల్, నువ్వు , వరి పంటలను ఏనుగులు నాశనం చేయకముందే వాటిని తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామం వైపు గజరాజుల గుంపు వెళ్లకుండా అటవీ సిబ్బందితో పాటు ట్రాకర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రైతులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లదరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Updated Date - May 03 , 2025 | 11:07 PM