ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Free Bus Travel ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ABN, Publish Date - May 31 , 2025 | 11:36 PM

Free Bus Travel for Women from August 15 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉచిత బస్సు సదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో ‘తల్లికి వందనం’ కూడా అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రతి మారుమూల గిరిజన గ్రామానికి, కొండ శిఖర ప్రాంతాలకు పక్కా రహదారులు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో పెద్దఎత్తున సీసీ రహదారులు, కాలువలు, గోశాలలు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు తమకు అనుకూల సమయంలో వెళ్లి రేషన్‌ పొందే వీలుందని తెలిపారు. కంటైనర్‌ ఆసుపత్రుల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.

Updated Date - May 31 , 2025 | 11:36 PM