ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Clinics Seized నాలుగు ప్రైవేట్‌ క్లీనిక్‌ల సీజ్‌

ABN, Publish Date - Jul 31 , 2025 | 11:50 PM

Four Private Clinics Seized భామిని మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్‌ క్లీనిక్‌లను అధికారులు సీజ్‌ చేశారు. సంబంధిత నిర్వాహకులకు నోటీసులు అందించారు. గురువారం రెవెన్యూ, వైద్య సిబ్బంది, పోలీస్‌ బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

సింగిడి క్లినిక్‌ నిర్వాహకులకు నోటీసులు అందిస్తున్న దృశ్యం
  • నిర్వాహకులకు నోటీసులిచ్చిన అధికారులు

భామిని, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భామిని మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్‌ క్లీనిక్‌లను అధికారులు సీజ్‌ చేశారు. సంబంధిత నిర్వాహకులకు నోటీసులు అందించారు. గురువారం రెవెన్యూ, వైద్య సిబ్బంది, పోలీస్‌ బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సింగిడి, గురండి గ్రామాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ, బీఎంపీ క్లీనిక్‌లు, మందుల షాపులు, ల్యాబ్‌లను పరిశీలించారు. కాగా నాలుగు క్లీనిక్‌లో ఏ ఒక్కరికీ రిజిస్టర్‌ సర్టిఫికెట్లు లేనట్లు ధ్రువీకరించారు. బీఫార్మసీ సర్టిఫికెట్లు లేకుండా మెడికల్‌ షాపులు, ల్యాబ్‌లు, మూడు బెడ్‌లతో క్లీనిక్‌లు నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఆయా చోట్ల ప్రాథమిక చికిత్స కాకుండా చిన్న పిల్లలు, పెద్దలకు అన్ని రకాల వైద్యాన్ని అందిస్తున్నట్టు తెలుసుకున్నారు. నిల్వ ఉన్న ఇంజక్షన్స్‌, మెడిసిన్స్‌ను స్వాధీనం తీసుకొని, నాలుగు క్లీనిక్‌లను సీజ్‌ చేశారు. ఈ సమాచారాన్ని జిల్లా అధికారులకు అందించామని తహసీల్దార్‌ ఎన్‌.శివన్నారాయణ తెలిపారు. ఈ తనిఖీల్లో బత్తిలి, భామిని వైద్యాధికారులు రవీంద్ర, సోయిల్‌, ఎస్‌ఐ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:50 PM