ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MSME Park ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన

ABN, First Publish Date - 2025-05-14T23:04:58+05:30

Foundation Laid for MSME Park సీతంపేటకు సమీపంలోని పాతపనుకువలస గ్రామ సరిహద్దులో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శంకుస్థాపన చేశారు. 27ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న దృశ్యం

సీతంపేట రూరల్‌ 14(ఆంధ్రజ్యోతి): సీతంపేటకు సమీపంలోని పాతపనుకువలస గ్రామ సరిహద్దులో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శంకుస్థాపన చేశారు. 27ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఏిపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌ వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతి గిరిజన గ్రామానికి తాగునీరు , రహదారి సౌకర్యం కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లూ రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఎంఎస్‌ఎంఇ పార్క్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తదితరుల పేర్లును అధికారులు విస్మరించారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మురళీమోహన్‌ను వివరణ కోరగా డీఆర్‌వో ఇచ్చిన పేర్లును మాత్రమే శిలాఫలకంలో వేశామని తెలిపారు.

Updated Date - 2025-05-14T23:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising