ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fine Rice for Midday Meal Scheme మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం

ABN, Publish Date - Jun 06 , 2025 | 11:58 PM

Fine Rice for Midday Meal Scheme జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సుమారు 490 టన్నులను సిద్ధం చేశారు. 25 కిలోల చొప్పున మొత్తంగా 19,572 ప్యాకెట్లను ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సన్న బియ్యాన్ని బస్తాల్లోకి నింపుతున్న దృశ్యం
  • ప్రత్యేక రైస్‌ ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు

గరుగుబిల్లి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సుమారు 490 టన్నులను సిద్ధం చేశారు. 25 కిలోల చొప్పున మొత్తంగా 19,572 ప్యాకెట్లను ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు ఒకవైపు మెరుగైన బోధన, మరోవైపు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. గతంలో మధ్యాహ్న భోజన పథకానికి రేషన్‌ దుకాణాల నుంచి బియ్యాన్ని పంపించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం అందించడంలో విఫలమైంది. దీంతో ఎంతోమంది విద్యార్థులు భోజనాన్ని తినలేకపోయేవారు. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి సన్న బియ్యం సరఫరా చేయాలని భావించింది. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సమయానికి నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేయాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు గరుగుబిల్లి మండలం సుంకి ప్రాంతంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌ నుంచి పాఠశాలలు, వసతిగృహాలకు బియ్యాన్ని తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి తరలింపు

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు సుంకి గోడౌన్‌ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లుకు సన్న బియ్యం తరలించనున్నాం. అక్కడి నుంచి రూట్‌ మ్యాప్‌ మేరకు పాఠశాలలు, వసతిగృహాలకు వాటిని తరలిస్తారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా బియ్యాన్ని ప్యాకింగ్‌ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయనున్నాం. అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నాం.

- ఆర్‌.హరిశంకర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, గోడౌన్‌ ఇన్‌చార్జి, సుంకి, గరుగుబిల్లి మండలం

Updated Date - Jun 06 , 2025 | 11:58 PM