తల్లికి వందనంతో పండగ వాతావరణం
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:02 AM
తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో పండగ వాతావరణం వచ్చిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మంత్రి సంధ్యారాణి
సాలూరు, జూన్ 14(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో పండగ వాతావరణం వచ్చిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆమె శనివారం స్థానిక విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో భాగంగా రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ కాగా, రూ.2వేలు చొప్పున పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. తల్లికి వందనం పథకంలో రూ.2వేలు లోకేష్ అకౌంట్‌లో పడుతున్నాయని వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని ఆమె సవాలు విసిరారు. గత ప్రభుత్వం మాదిరిగా అమ్మఒడి పథక ం ద్వారా మిగిలిన రూ.2వేలు భారతీరెడ్డి హ్యేండ్‌బ్యాగ్‌లోకి వెళ్లినట్టు ఇప్పు డు జరగలేదని ఆమె అన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో రుచికరమైన ఆహారాన్ని అంది స్తున్నామని తెలిపారు. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లల కు కొత్త పుస్తకాలు, యూనిఫారాలు, బెల్టులు, బూట్లు, సాక్సులు, బ్యాగులు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టీ), ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, గుళ్ల వేణుగొపాలనాయుడు, ఆముదాల పరమేశు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 12:02 AM