Fertilizers Seized రూ.28 లక్షల ఎరువులు సీజ్
ABN, Publish Date - Jun 28 , 2025 | 11:05 PM
Fertilizers Worth ₹28 Lakh Seized మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీసత్యసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడి చేశారు. ఎస్పీ బి.ప్రసాద్ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
పార్వతీపురం/మక్కువ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీసత్యసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడి చేశారు. ఎస్పీ బి.ప్రసాద్ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై యజమాని గ్రంథి సురేష్‌కుమార్‌ను ప్రశ్నించారు. షాపులో రికార్డులు పరిశీలించగా ఎరువుల నిల్వలకు స్టాక్ రిజిస్టర్‌కు మధ్య వ్యత్యాసం ఉన్నట్టు తేల్చారు. అనంతరం రూ.28.77 లక్షల విలువైన 119.925 టన్నులు కలిగిన 2399 ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్‌కు తాళాలు వేసి, స్టాక్ రిజిస్టర్, ఈ-పాస్ యంత్రాన్ని మండల వ్యవసాయాధికారికి అప్పగించారు. సోమవారం వాటిని జాయింట్ కలెక్టర్‌కు అప్పగించనున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారి రామారావు, ఎస్‌ఐ పురుషోత్తం, ఏవో భారతి, పోలీస్ సిబ్బంది, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 11:05 PM