ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers' Welfare రైతుల సంక్షేమమే లక్ష్యం

ABN, Publish Date - Aug 03 , 2025 | 12:09 AM

Farmers' Welfare is the Goal రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం పట్టణంలోని కోదండరామ కల్యాణ మండపంలో ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందన్నారు.

రైతులకు చెక్కు అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం పట్టణంలోని కోదండరామ కల్యాణ మండపంలో ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందన్నారు. రైతులకు ఏ కష్టం రానివ్వకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ‘పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు సాగు సాయంగా ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు చెప్పారు. తొలి విడతలో భాగంగా ప్రభుత్వం రూ.7వేలు జమచేసినట్లు తెలిపారు. జిల్లాలో 1.22 లక్షల మంది రైతులకు రూ.84.58 కోట్లు అందజేసినట్లు స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గంలో 31,294 మంది రైతుల ఖాతాల్లో రూ.21.9కోట్లు జమ చేసినట్లు వివరించారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌, ఏఎంసీ చైర్మన్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కురుపాంలో..

కురుపాం: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి చెక్‌లు అందించారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద నియోజకవర్గంలో 39,084 మందికి రూ. 27.36 కోట్ల మంజూరైనట్లు ఆమె తెలిపారు.

Updated Date - Aug 03 , 2025 | 12:09 AM