ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులు సాంకేతికతను వినియోగించుకోవాలి

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:58 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న అనుహ్య మార్పులు, సాంకేతికతను రైతులు శతశాతం వినియోగించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు.

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

-సాగు ఖర్చు తగ్గాలి.. ఆదాయం పెరగాలి

- ఉత్తరాంధ్ర వ్యవసాయ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

విజయనగరంరూరల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న అనుహ్య మార్పులు, సాంకేతికతను రైతులు శతశాతం వినియోగించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. మంగళవారం పీవీజీ రాజు కల్యాణ మండపంలో ఉత్తరాంధ్ర స్థాయి వ్యవసాయ సదస్సు జరిగింది. ఉత్తరాంధ్ర రైతుల ఆర్థిక పరిపుష్టి, విదేశీ ఎగుమతికి అవసరమైన పంటలు అనే అంశంపై వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖలకు చెందిన నిపుణులు తమ సలహాలు, సూచనలను రైతులకు అందించారు. ఈ సదస్సులో అశోక్‌ గజపతిరాజు పాల్గొని మాట్లాడారు. ‘సాగు ఖర్చు తగ్గాలి.. రైతుల ఆదాయం పెరగాలి. వ్యవసాయం, అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. రైతులకు మెరుగైన సేవలు అందించాలి. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయి. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి, ఎక్కువ ఆదాయం వచ్చేందుకు రైతులు శ్రమించాలి. అధికారులు, వ్యవసాయశాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటించాలి.’ అని అన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంచాలకుడు పి.వెంకటసత్యనారాయణ మాట్లాడుతూ.. ఏటా పంట సాగు పెరగాలన్నారు. వ్యవసాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. జపాన్‌ దేశం ప్రస్తుతం బియ్యం కొరతను ఎదుర్కొంటుందన్నారు. ఒకప్పుడు ఈ దేశంలో బియ్యం పుష్కలంగా దొరికేవన్నారు. కానీ, ఇప్పుడు అక్కడ ఐదు కిలోల రైస్‌ బస్తా రూ.2,900 ఉందన్నారు. మన దేశంలో ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు ఎప్పుడు కూడా తమ బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు పీవీకే భగవాన్‌, సీహెచ్‌ ముకుందరావు, డీవీఎస్‌ రాజు, రామ్‌గోపాల్‌, అశోక్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖాధికారి వీటీ రామారావు, క్షత్రియ పరిషత్‌ ప్రతినిధులు సీతారామరాజు, పీఎల్‌ఎన్‌ రాజు, విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:58 PM