ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:20 AM
కొండగంగుబూడి గ్రామ శివారు ఎస్.కోట సీతా రాంపురం గ్రామానికి చెందిన రైతు పరవాడ పరమేశ్వర రావు(45) దమ్ము పడుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
వేపాడ, జూలై 21 (ఆంధ్ర జ్యోతి): కొండగంగుబూడి గ్రామ శివారు ఎస్.కోట సీతా రాంపురం గ్రామానికి చెందిన రైతు పరవాడ పరమేశ్వర రావు(45) దమ్ము పడుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ పరమేశ్వరరావు అనే రైతు సోమవారం సాయంత్రం తన సొంత పొలంలో ట్రాక్టర్‌తో దమ్ము పడుతుండగా ట్రాక్టర్ బోల్తాప డింది. దీనిని గమనించిన స్థానికులు వెళ్లి చూసేసరికి.. ట్రాక్టర్ కిందపడి పరమేశ్వరరావు మృతి చెంది ఉన్నాడు. వెంటనే వారు కుటుంబ సభ్యుల కు సమాచారం అందించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, తల్లి అచ్చి య్యమ్మ, ఇద్దరు కుమార్తెలు హైమావతి, లీలావతిలు ఉన్నారు. చిన్న కు మార్తె లీలావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్దని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - Jul 22 , 2025 | 12:20 AM