ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fans are shocked by the death of Kota Srinivasa Rao కోట శ్రీనివాసరావు మృతితో అభిమానుల దిగ్ర్భాంతి

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:29 PM

Fans are shocked by the death of Kota Srinivasa Rao విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసి జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్ర్భాంతి చెందారు. వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కోట శ్రీనివాసరావు మృతితో

అభిమానుల దిగ్ర్భాంతి

షూటింగ్‌ కోసం జిల్లాకు ఓసారి రాక

విజయనగరం/రూరల్‌, జూలై13(ఆంధ్రజ్యోతి):

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసి జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్ర్భాంతి చెందారు. వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాటకరంగం, సినిమా రంగం రెండింటిలోనూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 1990 నుంచి 2000, 2000 నుంచి 2015 వరకూ ఒక విధంగా కోట శ్రీనివాసరావు యుగం అని చెప్పాలి. ఆయన లేని సినిమాయే లేదు. విభిన్న పాత్రల్లో తనదైన శైలిలో ఒదిగిపోయి నవ్వుల్లోనూ, కన్నీళ్లల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 750 పైగా సినిమాల్లో నటించిన ఆయన 9 నంది అవార్డులు పొందారు.

1993లో విజయనగరం రాక

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘బొబ్బిలి సింహాం’ సినిమా షూటింగ్‌ విజయనగరం, కోరుకొండ, కోరుకొండపాలెం, సారిక తదితర ప్రాంతాల్లో జరిగింది. ఆ సమయంలో కోట శ్రీనివాసరావు పది రోజుల పాటు విజయనగరంలోనే ఉన్నారు. హోటల్‌ నుంచి రోజూ షూటింగ్‌కు వెళ్లేవారు. సాయంత్రం లాడ్జికి చేరుకుని ఇక్కడి స్నేహితులతో మాట్లాడేవారు.

తీరని లోటు

కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ

సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి సినీ అభిమానులకు, కళాకారులకు, సాహితీ ప్రియులకు తీరని లోటు. ఆయన ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, నటించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ఆయన వ్యక్తిత్త్వం ఎంతో గొప్పది

విజ్జపు ప్రసాద్‌, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు

సినీ నటుడు కోట శ్రీనివాసరావు వ్యక్తిత్వం ఎంతో గొప్పది. 1993లో విజయనగరానికి షూటింగ్‌ కోసం వచ్చారు. ఇక్కడ పది రోజులు ఉన్నారు. షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఆయన నాటక రంగం గురించి, సాహిత్యం గురించి చర్చించేవారు. విజయనగరం కళలకు, సాహిత్యానికి నిలయమనేవారు. విజయనగరానికి ఎక్కువ సార్లు రావాలని కోరుకునేవారు.

Updated Date - Jul 13 , 2025 | 11:29 PM