ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:24 AM
ఏడా ది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజలకు వివరించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
విజయనగరం రూరల్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఏడా ది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజలకు వివరించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుప రిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమ వారం సాయంత్రం నగరంలోని 10, 11 డివిజన్ల పరిధిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రెండు డివిజన్ల పరిధిలో పలు ఇళ్లకు వెళ్లి ఏడాది పాలనలో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాను న్న నాలుగేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:24 AM