ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రుణాల లక్ష్యాలను అధిగమించాలి

ABN, Publish Date - May 23 , 2025 | 12:15 AM

మహిళా సంఘాల సభ్యులు ఆర్ధికంగా మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో స్త్రీనిధి ద్వారా మంజూరు చేస్తున్న రుణాల లక్ష్యాలను సిబ్బంది అధిగమించాలని జిల్లా స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కామరాజు కోరారు. గురువారం గరుగుబిల్లి వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి రుణాలు పంపిణీకి సంబంధించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న ఏజీఎం కామరాజు

గరుగుబిల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యులు ఆర్ధికంగా మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో స్త్రీనిధి ద్వారా మంజూరు చేస్తున్న రుణాల లక్ష్యాలను సిబ్బంది అధిగమించాలని జిల్లా స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కామరాజు కోరారు. గురువారం గరుగుబిల్లి వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి రుణాలు పంపిణీకి సంబంధించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్త్రీనిధి రుణాల మంజూరులో వెలుగు ఏపీఎం పి.అప్పల నాయుడు ఆధ్వర్యంలో క్లస్టర్‌ కోఆర్డినేటర్లు ప్రత్యేక శ్రద్ధ కనపరచడం పట్ల ఏజీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం ఏజీఎం మాట్లాడుతూ గరుగుబిల్లి మండలానికి సం బం దించి రూ. 9.84 కోట్లను 985 మంది మహిళా సంఘాల సభ్యులకు రుణాలు మం జూరుచేయాలని తెలిపారు.ఇప్పటికే రూ. 1.80 కోట్లు రుణాలను అందజేసినట్లు ఏపీఎం అప్పలనాయుడు ఏజీఎంకు తెలియజేశారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు తిరిగి సకాలంలో చెల్లించాలని కోరారు. సభ్యులు ఆర్థికంగాస్వావలంభన సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోం దన్నారు. జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున స్త్రీనిధి రుణా లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు స్త్రీనిధి రూ. 50 వేలు మంజూరు చేసేవారని, అయితే ప్రస్తుతం లక్ష రూపాయల వరకు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో వెలుగు ఏపీఎం అప్పలనాయుడు, క్లస్టర్‌ కోఆర్డినేటర్లు చందాన తిరుపతిరావు, బొంగు రామినాయుడు, వి.లక్ష్మణరావు, టి.చంద్రమోహన్‌, కార్యాలయ సిబ్బంది కె.రమేష్‌, ఉడమల శాంతికుమారి పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:15 AM