ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:48 PM

జగన్నాథస్వామి తొలి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. దీనికోసం జిల్లాలోని ప్రధాన ఆలయాలు, రథాలు ముస్తాబయ్యాయి. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పార్వతీపురంలో సిద్ధంగా ఉన్న రథం.

- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

- పది రోజులపాటు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్న స్వామివారు

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జగన్నాథస్వామి తొలి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. దీనికోసం జిల్లాలోని ప్రధాన ఆలయాలు, రథాలు ముస్తాబయ్యాయి. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నుంచి పది రోజుల పాటు వివిధ రూపాల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథంపైన కొలువుదీరే సుభద్ర, జగన్నాథస్వామి, బలభద్రుడు ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని దంగిడి వీధిలో ఉన్న జగన్నాథస్వామి ఆలయంలో ఈవో ఎం. ప్రసాదరావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ప్రధాన ఆలయం నుంచి గుడించా మందిరం వరకు మేళాతాళాలతో రథయాత్ర జరగనుందని చెప్పారు. తొలిరోజు స్వామివారు శుభమంగళ రూపంలో, 28 నుంచి జూలై 5న జరిగే మారు రథయాత్ర వరకు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 11:48 PM