ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ODF Plus ప్రతి గ్రామం ఓడీఎఫ్‌ ప్లస్‌ కావాలి

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:14 PM

Every Village Should Become ODF Plus ప్రతి గ్రామం ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహిత) కావాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామం ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహిత) కావాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి. బహిరంగ మలవిసర్జన వల్ల పరిసరాలు, తాగునీరు, వాతావరణం కలుషితమవుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తు అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియ జేయాలి. వర్షాకాలంలో అతిసారం వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పల్లెవాసులను చైతన్యపర్చాలి. కొన్ని ప్రాంతాల్లో గోతుల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మీడియాలో వచ్చే వార్తలపై స్పందించాలి.’ అని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.హేమలత, డిప్యూటీ కలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తి, ఈపీడీసీఎల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ కె.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:14 PM