ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

I will give suggestions for development. రాజకీయాలకు దూరం అయినా.. అభివృద్ధికి సూచనలు ఇస్తా

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:09 AM

I will give suggestions for development గవర్నర్‌ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ఈ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌, దేశాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటానని గోవా గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారు. విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఆ గౌరవాన్ని మరింత ఇనుపడింప చేసేలా గవర్నర్‌గా బాఽధ్యతలు నిర్వహిస్తానన్నారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

రాజకీయాలకు దూరం అయినా..

అభివృద్ధికి సూచనలు ఇస్తా

తెలుగు వారి గౌరవం మరింత ఇనుమడింప చేస్తా

అవకాశం కోసం పరుగెత్తలేదు.. వస్తే న్యాయం చేశా

విలేకరులతో పూసపాటి అశోక్‌ గజపతిరాజు

విజయనగరం/రూరల్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ఈ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌, దేశాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటానని గోవా గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారు. విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఆ గౌరవాన్ని మరింత ఇనుపడింప చేసేలా గవర్నర్‌గా బాఽధ్యతలు నిర్వహిస్తానన్నారు. రాజకీయాల్లో అవకాశం కోసం తానెప్పుడూ పరుగెత్తలేదని, అవకాశం వస్తే తగిన న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నానన్నారు. బంగ్లా తనకు అలవాటు అయిందని, కొత్త అసైన్‌మెంట్‌ వచ్చినప్పుడు అక్కడికి వెళ్లడం, పూర్తయిన తరువాత బంగ్లాకి రావడం జరుగుతుందన్నారు. తిరిగి అసైన్‌మెంట్‌ ఇస్తే అక్కడికి కూడా వెళ్తానన్నారు. విజయనగరం ప్రజలని, ఈ ప్రాంతాన్ని మరువలేనని, ఇక్కడి ప్రజలకు ఏ స్థాయిలో ఉన్నా సేవలు అందిస్తూ ఉంటానన్నారు. తనకి గవర్నర్‌గా నియమించిన ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగానని, గవర్నర్‌గా నియమితులైన తనకు వెన్నంటి ఉండి సహకరించిన సతీమణి సునీలా గజపతిరాజు సహాయ, సహకారాలు మరువలేనివన్నారు. సమావేశంలో టీడీపీ నాయకుడు ఐవీపీ రాజు పాల్గొన్నారు.

- గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్‌ గజపతిరాజుకు సోమవారం సాయంత్రం పైడిమాంబ దేవస్థానం పురోహితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీరిషాతో పాటు సూపరింటెండెంట్‌ ఏడు కొండలు, పూజారి బంటుపల్లి వెంకటరావు ఆలయ సిబ్బంది ఉన్నారు. అశోక్‌గజపతిరాజుకు గవర్నర్‌ పదవి దక్కినందుకు పైడిమాంబ ఆలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేశారు.

అశోక్‌కు శుభాకాంక్షల వెల్లువ

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియామకమైనట్లు తెలిసి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అశోక్‌ బంగ్లా టీడీపీ, ఆయన అభిమానులు, కార్యకర్తలతో సోమవారం సందడిగా కనిపించింది. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి కలిశారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, భర్త కోళ్ల రాంప్రసాద్‌ శాలువతో సన్మానించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగారాజు, విజయనగరం కమిషనర్‌ పి.నల్లనయ్య, ఇతర అధికారులు, నాయకులు హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జిల్లాలో అందుబాటులో లేనందున అశోక్‌ గజపతిరాజుకు ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 15 , 2025 | 12:09 AM