Ambedkar Gurukul Schools అంబేడ్కర్ గురుకులాల్లో మిగులు సీట్లకు 25న పరీక్ష
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:04 AM
Entrance Test on 25th for Vacant Seats in Ambedkar Gurukul Schools ఉమ్మడి జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.రూపవతి గురువారంఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 13 గురుకులాల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
గరుగుబిల్లి/సాలూరు రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.రూపవతి గురువారంఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 13 గురుకులాల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి ఈ నెల 25న బాలికలకు నెల్లిమర్ల సాంఘిక సంక్షేమ పాఠశాలలో, బాలురకు కొప్పెర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆయా తరగతుల్లో ప్రవేశం కోరే వారు ఈ నెల 23 లోగా దరఖాస్తులివ్వాలని సూచించారు. అంబేడ్కర్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి పరీక్ష రాసి సీటు రాని బాలురు ఈ నెల 23న కొప్పెర్ల, బాలికలు చీపురుపల్లిలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని కోరారు. ఇంటర్మీడియట్ ప్రథమ ఏడాదికి ప్రవేశపరీక్ష రాసి సీటు రాని బాలికలు ఈ నెల 26న నెల్లిమర్లలో, బాలురు 27న కొప్పెర్లలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని మాత్రమే కౌన్సిలింగ్‌కు రావాలని తెలిపారు.
Updated Date - Jun 20 , 2025 | 12:04 AM