గిజబలో ఏనుగుల తిష్ఠ
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:37 PM
మండలంలోని గిజబ గ్రామ సమీపంలోనే ఏనుగులు తిష్ఠవేశాయి. గత రెండు రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గరుగుబిల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిజబ గ్రామ సమీపంలోనే ఏనుగులు తిష్ఠవేశాయి. గత రెండు రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి ఆనుకుని తోటపల్లి ప్రాజెక్టుతో పాటు పామాయిల్, అరటి, పలు రకాల పండ్ల తోటలు ఉండడం గజరాజులకు కలిసివచ్చింది. దీంతో ఆ ప్రాంతం నుంచి అవి కదలడం లేదు. ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్న సమయంలో ఏనుగులు సంచరిస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. గ్రామాల వైపు ఏనుగులు వెళ్లకుండా అటవీ సిబ్బంది, ట్రాకర్లు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనుల దృష్ట్యా ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:37 PM